Home ప్రత్యేకం సాయి పల్లవి 'సారంగ దరియా’ సాంగ్‌​.. దుమ్ములేపేసింది!

సాయి పల్లవి ‘సారంగ దరియా’ సాంగ్‌​.. దుమ్ములేపేసింది!

యంగ్ హీరో నాగచైనత‍్య, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది. తాజాగా ‘లవ్ స్టోరి’ నుంచి మూడో పాటను స్టార్ హీరోయిన్ సమంత తాజాగా విడుదల చేసింది. సుద్దాల ఆశోక్‌తేజ అందించిన సాహిత్యానికి గాయని మంగ్లీ మ్యాజిక్‌ వాయిస్‌ తోడవడంతో మరోసారి వినాలనిపించేంత అద్బుతంగా పాట ఉంది. పవన్‌ సీహెచ్‌ అందించిన మంచి బీట్‌తో కూడిన సంగీతం వినసొంపుగా ఉంది.

ఇక ఈ మాస్‌ సాంగ్‌కు సాయిపల్లవి అదిరిపోయే స్టెప్పులేసింది. ఇప్పటికే ఇందులోని ‘ఏయ్‌ పిల్లా..’అనే పాట యువతను ఆమితంగా ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. అమిగోస్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ‘లవ్‌స్టోరి’ ఏప్రిల్‌ 16న థియేటర్లలో విడుదల కానుంది. అందాకా ఈ పాటలను చూసి ఆనందించండి!

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు