Home వార్తలు సవాలుకు ప్రతి సవాల్..నందిగ్రామ్‌ నుంచే సువేందు అధికారి పోటీ!

సవాలుకు ప్రతి సవాల్..నందిగ్రామ్‌ నుంచే సువేందు అధికారి పోటీ!

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీఎంసీ, ప్రతిపక్ష భాజపా మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, బీజేపీలో చేరిన సువేందు అధికారి మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా మ‌మ‌త‌ను ఓడిస్తాన‌ని సువేందు అధికారి స్ప‌ష్టం చేశారు. సువేందు అధికారి సిట్టింగ్‌ స్థానమైన నందిగ్రామ్‌ (పుర్బో మేధినీపూర్‌) నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మ‌మ‌త ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. సువేందు అధికారిని అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దింపి మ‌మ‌త‌ను ఓడించాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు సమాచారం. బీజేపీ త‌న‌ను నందిగ్రామ్‌లో అభ్యర్థిగా నిలిపితే మమతాబెనర్జీని కనీసం 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తా. లేదంటే రాజకీయాలను వదిలేస్తాను అని సువేందు స్పష్టం చేశారు.


కాగా మరికొన్ని నెలల్లో పశ్చిమబెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మాత్రం తృణమూల్‌కు భాజపా ప్రధాన పోటీదారుగా నిలుస్తోంది. ప్రధానిగా మోదీ రెండో సారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో భాజపా బలం క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కీలక నేత సువేందు అధికారితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు. మరికొంత మంది కూడా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలను ఎదుర్కోవడం మమతా బెనర్జీకి అంతసులువేం కాదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు