Home సినిమాలు సలార్‌’లో ప్రభాస్‌కు విలన్‌గా విజయ్‌ సేతుపతి

సలార్‌’లో ప్రభాస్‌కు విలన్‌గా విజయ్‌ సేతుపతి

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. పాన్‌ ఇండియన్‌ చిత్రంగా తెరకెక్కనున్న ‘సలార్‌’లో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ‘సలార్‌’ అంటే సమర్థవంతమైన నాయకుడు.. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని ప్రశాంత్‌నీల్‌ ఓ సందర్భంలో వెల్లడించిన విషయం తెలిసిందే.
కాగా,భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ‘సలార్‌’లో విలన్ గా కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతిని ఎంపిక చేసినట్లు సమాచారం. ‘మాస్టర్‌’లో ప్రతినాయకుడి పాత్రను పోషించిన  విజయ్‌సేతుపతి నటనకు ముగ్దుడైన ప్రశాంత్‌ నీల్‌.. ‘సలార్‌’ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే సలార్‌ షూటింగ్‌ లో పాల్గొననున్నాడు..అనంతరం ఆదిపురుష్‌ చిత్రీకరణలో కూడా పాల్గోననున్నాడు ప్రభాస్‌. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో  ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు