Home ప్రత్యేకం సర్‌ప్రైజ్‌: సంజనని పెళ్లాడిన బుమ్రా.. ఫోటోలు వైరల్

సర్‌ప్రైజ్‌: సంజనని పెళ్లాడిన బుమ్రా.. ఫోటోలు వైరల్

టీమ్‌ఇండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి, స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజనా గణేషన్‌ను వివాహం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలోను కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని ఆనందం వ్యక్తం చేశాడు

“మా జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాము. ఈరోజు మా జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం” అని బుమ్రా సంజనను పెళ్లాడిన ఫొటోలను పోస్టు చేశాడు.

అయితే ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు వ్యక్తిగత కారణాలతో బుమ్రా సెలవులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచీ అతడి వివాహంపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదిలావుంటే.. మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఐపీఎల్‌ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌కి కూడా స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా సంజనా పనిచేశారు. సంజనా‌కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.43 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడు బుమ్రాను పెళ్లి చేసుకుంటుందనే వార్తలతో సంజన మరింత ఫేమస్ అయ్యారు. ఐపీఎల్ సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరించనప్పుడే బూమ్రాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్టు అతన్ని సన్నిహితులు చెబుతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు