Home సినిమాలు 'సర్కారు వారి పాట' సెట్స్ నుండి మహేష్ స్టైలిష్ పిక్ లీక్..

‘సర్కారు వారి పాట’ సెట్స్ నుండి మహేష్ స్టైలిష్ పిక్ లీక్..

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మహేష్ కెరీర్‌లో తెరకెక్కుతున్న 27వ సినిమా ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే దుబాయ్‌లో నెల రోజుల భారీ షెడ్యూల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇటీవలే దుబాయ్ లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కరోనా వ్యాప్తి కారణంగా రెండో షెడ్యూల్ షూటింగ్ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే మంగళవారం ఈ సినిమా రెండో షెడ్యూల్ షూట్ ప్రారంభించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే తాజాగా ప్రారంభించిన షెడ్యూల్ నుంచి మహేష్ బాబు పిక్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో బ్లూ జీన్స్ బ్లూ షర్ట్ లో ఉన్న మహేష్ మాస్క్ పెట్టుకుని స్టైల్ గా నడుస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా, ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు. 2022 జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు