Home సినిమాలు 'సర్కారు వారి పాట' మూవీ బిగ్ అప్‌డేట్!

‘సర్కారు వారి పాట’ మూవీ బిగ్ అప్‌డేట్!

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే ‘సర్కారు వారి పాట’. మహేశ్‌తో ‘మహానటి’ కీర్తి సురేశ్‌ తొలిసారిగా జోడీ కడుతున్నారు. వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతకుముందు దుబాయ్‌లో షూటింగ్ ‌ను జ‌రుపుకున్న ఈ చిత్రం తరువాత హైదరాబాద్ లోనే కొత్త షెడ్యూల్ ను మొదలెట్టి షూట్ చేసింది

కానీ మధ్యలో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ తర్వాతి షెడ్యూల్ ను జూన్ నుండి మొదలుపెట్టాలని.. అది ఒక సాంగ్ తో షూట్ ను ప్రారంభించాలని చూస్తున్నారని సమాచారం. ఈ సాంగ్  గోవా నేపథ్యంలో సాగనుందట. అందుకే వచ్చే షెడ్యూల్ ను గోవాలో ఫిక్స్ చేశారని తెలుస్తోంది. కాగా, 14 రీల్స్‌ ప్లస్‌, మహేశ్‌బాబు సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. భరత్‌ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస సక్సెస్‌ల తర్వాత మహేశ్‌ నటిస్తోన్న లేటెస్ట్‌ చిత్రం కావడంతో సర్కారు వారి పాట మీద భారీ అంచనాలే నెలకొన్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు