Home సినిమాలు 'సర్కారు వారి పాట': మహేశ్ బాబు తండ్రి పాత్రలో స్టార్ హీరో ఫిక్స్!

‘సర్కారు వారి పాట’: మహేశ్ బాబు తండ్రి పాత్రలో స్టార్ హీరో ఫిక్స్!

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. మహానటి ఫేమ్‌ కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పరుశురామ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాన్ని తీసుకొని ఈ కథ రాసుకున్న పరశురామ్.. షూటింగ్‌లో చాలా జాగ్రత్త వహిస్తున్నారట. ప్రతి సన్నివేశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కెమెరాలో బందిస్తున్నారట. 

అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో మలయాళ సీనియర్ హీరో జయ్ రామ్ నటించబోతున్నాడని తెలుస్తోంది. జయరామ్ ఈ చిత్రంలో ఒకరి చేతిలో మోసపోయే బ్యాంక్ మేనేజర్ గా కనిపిస్తారు. ఆ పాత్రలో ఎమోషన్స్ ని అద్భుతంగా పలికించేందుకు ఆస్కారం ఉందని తెలిసింది. తన తండ్రికి ఎదురైన సమస్యను మహేష్ ఎలా పరిష్కరించారన్నది వినోదాత్మకంగా పరశురామ్ చూపించనున్నారట. కాగా.. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి థమన్ బాణీలు కడుతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు