Home ప్రత్యేకం 'సర్కారు వారి పాట' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

‘సర్కారు వారి పాట’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహానటి ఫేమ్‌ కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పరుశురామ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఇటీవల ప్రారంభించిన రెండో షెడ్యూల్ కరోనా వల్ల తాత్కాలికంగా వాయిదా పడింది.

ఇదిలాఉంటే.. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ పని చేస్తున్న యువ నటి స్వప్నిక సోషల్ మీడియాలో నిర్వహించిన చాట్ సెషన్ లో సర్కారు వారి పాట మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే సూపర్ హిట్ ఫిల్మ్ గా నిలుస్తుందని అలాగే దుబాయ్ లో షూట్ చేసిన ఫైట్ ఎపిసోడ్ కూడా అద్భుతంగా వచ్చిందని తెలిపింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ , ఫస్ట్ లుక్ వచ్చే మే 31న రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ ఆమె వెల్లడించింది

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు