Home సినిమాలు 'సర్కారువారి పాట’ క్రేజీ అప్‌డేట్: యాక్ష‌న్ కింగ్‌ని ఢీకొట్ట‌నున్న సూప‌ర్ స్టార్

‘సర్కారువారి పాట’ క్రేజీ అప్‌డేట్: యాక్ష‌న్ కింగ్‌ని ఢీకొట్ట‌నున్న సూప‌ర్ స్టార్

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. యంగ్ డైరెక్టర్ పరశురామ్‌ దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్‌ పాత్రకు ఇప్పటికే ఉపేంద్ర, సుదీప్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్‌ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రంలోని ఓ ప్రధాన పాత్రకు అర్జున్‌ను చిత్రయూనిట్‌ సంప్రదించిందని, ఆ పాత్ర న‌చ్చ‌డంతో వెంట‌నే ఆయన ఓకే చెప్పేశార‌ని సమాచారం.
కాగా, జూలైలో ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారు చిత్రబృందం. అందులో మహేశ్‌, అర్జున్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారట. దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌ర్కారు వారి పాట చిత్ర బృందం తాజా షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుపుకోనుంది. ఇక అర్జున్ చివ‌రిగా అల్లు అర్జున్ న‌టించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ల నటించిన సంగతి తెలిసిందే.
ఇదిలాఉంటే.. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది  జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు