Home సినిమాలు 'సరిలేరు నీకెవ్వరు’ కాంబో రిపీట్.. అనిల్‌తో మహేశ్‌ మరో మూవీ ఫిక్స్!

‘సరిలేరు నీకెవ్వరు’ కాంబో రిపీట్.. అనిల్‌తో మహేశ్‌ మరో మూవీ ఫిక్స్!

సూపర్ స్టార్ మహేశ్‌బాబు– స్టార్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. గతేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ హిట్‌ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ కాబోతోందని సమాచారం. ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు మహేశ్‌. ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకుడు.ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ప్లాన్‌లో మహేశ్‌ ఉన్నారట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. అనిల్‌ రావిపూడి సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ లో పాల్గొంటారు మహేశ్‌.  

మరోవైపు మహేశ్‌బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తీ సురేశ్‌ కథానాయిక. మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దుబాయ్‌ షెడ్యూల్‌లో ఓ యాక్షన్‌ సన్నివేశం, ఓ పాట, కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. తాజాగా దుబాయ్‌ షెడ్యూల్‌ పూర్తయింది. చిత్రబృందం హైదరాబాద్‌ తిరిగొచ్చారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ గోవాలో జరగనుందని సమాచారం. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు