Home ప్రత్యేకం సరికొత్త రికార్డ్ సాధించిన గోండు బెబ్బులి కొమురం భీమ్..!

సరికొత్త రికార్డ్ సాధించిన గోండు బెబ్బులి కొమురం భీమ్..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ నటిస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి పెంచాయి. అందులో ముఖ్యంగా ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ పేరుతో విడుదల చేసిన కొమురం భీమ్‌ టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ తెలుగులో ఏ సినిమాకు సాధ్యం కానన్ని లైకులు సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి 2020 అక్టోబర్ 22న విడుదల చేయబడిన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో 50M+ వ్యూస్ మార్క్ అందుకున్న మొట్ట మొదటి టీజర్ గా కొమురం భీమ్ ఇంట్రో వీడియో రికార్డ్ సాధించింది. అలాగే ఈ వీడియోకి 1.3M పైగా లైక్స్ మరియు 1.4M కామెంట్స్ వచ్చాయి. కాగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. కాగా.. చరణ్‌కు జోడీగా అలియాభట్‌, తారక్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ సందడి చేయనున్న విషయం తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు