Home సినిమాలు సమంత - గుణశేఖర్‌ల 'శాకుంతలం'లో దుర్వాస మహర్షిగా మోహన్ బాబు!

సమంత – గుణశేఖర్‌ల ‘శాకుంతలం’లో దుర్వాస మహర్షిగా మోహన్ బాబు!

దర్శకుడు గుణ‌శేఖ‌ర్ ఆదిప‌ర్వంలోని ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘శాకుంతలం’. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డీఆర్‌పీ, గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ  నిర్మిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని శకుంతలగా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మలయాళ యువ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు.అయితే, ఈ సినిమా పూజ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా చిత్ర యూనిట్‌ షేర్‌ చేసింది. ఈ సందర్భంగా వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ జరగనున్నట్లు వెల్లడించింది.

అయితే అభిజ్ఞాన శాకుంతలంలో కీలకమైన దుర్వాస మహర్షి పాత్ర ఎవరు పోషిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభిజ్ఞాన శాకుంతలం కథలో దుర్వాస మహర్షి మహా కోపిష్టి. కోపంలో శపించడం.. మళ్ళీ కోపం తగ్గిన వెంటనే ఆ శాపానికి విరుగుడు చెప్పడం చేస్తుంటాడు. భర్త కోసం ఎదురుచూస్తూ పరధ్యానంలో ఉండిపోయిన శకుంతల తనను పట్టించుకోలేదన్న కోపంతో శపించి ఆమె తన భర్త దుష్యంతున్ని మర్చిపోయేలా చేస్తాడు. ఇలా శకుంతల జీవితాన్ని మలుపుతిప్పే దుర్వాస ముని పాత్రలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటించనున్నారని సమాచారం.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

కాగా.. అనుష్కతో ‘రుద్రమదేవి’ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్‌ సమంతతో ‘శాకుంతలం’ మూవీ పాన్‌ ఇండియాగా తెరకెక్కిస్తుండంతో దీనిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు