Home ప్రత్యేకం సప్తగిరుల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం.. తితిదే అధికారిక ప్రకటన

సప్తగిరుల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం.. తితిదే అధికారిక ప్రకటన

శ్రీరామ భక్తుడు ఆంజనేయుడి జన్మ స్థలంపై శ్రీరామ నవమి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కీలక ప్రకటన చేసింది. హనుమంతుడి జన్మస్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రి అని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. అంజనాదేవి తపస్సు ఫలితంగా వాయుదేవుని ఆశీర్వాదంతో తిరుమల గిరి కొండల్లోని అంజనాద్రిపై వెలసిన జపాలీ తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమని ఆధారాలతో సహా నిరూపితమైనట్లు టీటీడీ వెల్లడించింది.

ఈ విషయాన్ని తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు. అంజనేయుడి జన్మస్థలంపై నాలుగు నెలల పాటు తమ కమిటీ అన్వేషణ కొనసాగిందని ఆచార్య మురళీధర శర్మ చెప్పారు. అన్వేషణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కాగా, అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడని ఆధారాలతో నిరూపించేందుకు 2020 డిసెంబరులో టీటీడీ ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వీసీ, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ పాటు ఇస్రో శాస్త్రవేత్త, రాష్ట్ర పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ పరిశీలన చేసి బలమైన ఆధారాలు సేకరించింది. వివిధ గ్రంథాల ప్రకారం శ్రీవేంకటేశ్వరస్వామి చెంత ఉన్న అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని యుగం, తేదీ ప్రకారం నిర్ధారించారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు