Home క్రీడలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన వార్నర్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన వార్నర్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఆ జట్టు సారథి, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ ఐపీఎల్- 2021 సీజన్ లో ఆడనున్నట్లు స్పష్టం చేశాడు. ఆసీస్‌, టీమిండియా సిరీస్‌ మధ్యలో వార్నర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గజ్జల్లో గాయం అవడంతో మూడో వన్డేతో పాటు టీ 20 సిరీస్‌కు దూరమయ్యాడు.

అయితే గజ్జల్లో గాయం నుంచి కోలుకోవడానికి 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని వార్నర్‌ సోమవారం తెలిపిన సంగతి తెలిసిదే. దీంతో రెండు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2021వ సీజన్‌కు అతడు అందుబాటులో ఉండడని అందరూ భావించారు. అయితే తాజాగా తన గాయం తీవ్రతపై వార్నర్‌ స్పష్టత ఇచ్చాడు.

ఈ క్రమంలో వార్నర్ మాట్లాడుతూ..”గాయం తీవ్రత మరో కొన్ని నెలలు ఉంటుందని, అప్పటివరకు మైదానాన్ని వీడాల్సిన అవసరం లేదని తెలిపాడు. మర్చిలోనే మైదానంలోకి దిగుతున్నట్లు ట్వీట్ చేశాడు. ‘‘సోమవారం రాత్రి నేను చేసిన కామెంట్స్ కు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం మరో 6 నుంచి 9 నెలల సమయం పడుతుంది. కానీ మార్చి 4 నుంచే న్యూసౌత్‌వేల్స్‌ జట్టు తరఫున తిరిగి బరిలోకి దిగుతున్నా’’ అని వార్నర్‌ ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలతో వార్నర్‌ ఐపీఎల్‌ 2021 సీజన్ లో బరిలోకి దిగుతాడాని స్పష్టంగా తెలుస్తోంది.

ఇదిలావుంటే.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 142 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్..  5,254 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016లో వార్నర్‌  కెప్టెన్సీలోనే సన్‌‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు టైటిల్‌ సాదించిన విషయం తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు