Home సినిమాలు ‘సత్యమేవ జయతే’ అంటూ దూసుకొచ్చిన పవర్ స్టార్.. దుమ్మురేపుతున్న లిరికల్ సాంగ్

‘సత్యమేవ జయతే’ అంటూ దూసుకొచ్చిన పవర్ స్టార్.. దుమ్మురేపుతున్న లిరికల్ సాంగ్

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ నుంచి మరో సాంగ్ వచ్చేసింది. ఈ సినిమాలోని ‘సత్యమేవ జయతే’ అనే పాటని తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. గాయకుడు శంకర్‌ మహదేవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రచించగా తమన్‌ స్వరాలు అందించారు. శంకర్‌ మహదేవన్‌, పృథ్వీ చంద్ర, తమన్‌ పాడారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. 

బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌గా రూపొందుతోంది. శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 9న విడుదలకానుందీ సినిమా. కొన్నాళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. తన కెరీర్‌లో తొలిసారి లాయర్‌ పాత్ర పోషిస్తున్నారాయన. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’ గీతం అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు