ఇన్నాళ్లూ రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌కల్యాణ్ వరుస చిత్రాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా మరో అప్డేట్తో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్.వకీల్ సాబ్ మూవీ నుంచి రెండో సాంగ్ ‘సత్యమేవ జయతే…’ లిరికల్ సాంగ్ మార్చి 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ లుక్ అద్భుతంగా ఉంది. లాయర్ కోటు ధరించి పవన్ కళ్యాణ్ కనిపిస్తుండగా.. ఆయన వెనుక మహాత్మ గాంధీ ఫొటో ఉంది.
కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శృతి హాసన్ కీలక పాత్ర పోషిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది