Home ప్రత్యేకం 'సకల కళాభినేత్రి’: యాంకర్‌ సుమకు అరుదైన గౌరవం..

‘సకల కళాభినేత్రి’: యాంకర్‌ సుమకు అరుదైన గౌరవం..

సుమ కనకాల.. పరిచయం అక్కర్లేని పేరు. ఇంకా చెప్పాలంటే ప్రతీ ఇంట్లో కూడా ఈ పేరుతో పరిచయం ఉంది. అందరి ఇంటి మనిషిలా మారిపోయింది సుమ. యాంకర్‌గానే కాకుండా ఇంట్లో మనిషిలా ఈమెను ఫీల్ అవుతుంటారు అంతా. సుమ కూడా అలాగే అందరిని నవ్విస్తుంటుంది. సరదాగా ఉంటుంది కాబట్టే ఇప్పటి వరకు ఈమెకు తిరుగులేదు.. ఈమె లాంటి యాంకర్ మళ్లీ తెలుగులో వస్తుందా రాదా అనేది కూడా అనుమానమే. ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా సుమ కనకాల ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.

ఇదిలావుంటే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చికాగోలోని ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) ఆధ్వర్యంలో యాంకర్‌ సుమ కనకాలతో ‘సుమతో సందడి’ అనే కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అమెరికా వ్యాప్తంగా ఉన్న మహిళలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రై-స్టేట్ అసోసియేషన్ తెలుగు ప్రజల తరఫున సుమకు ‘సకల కళాభినేత్రి’ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. అరవై నాలుగు కళల్లో వినోదం ఒక కళ అయితే, వినోద పరచడంలో అరవై నాలుగు కళలను ప్రదర్శించే సుమకు ఈ బిరుదు ఇవ్వటం గౌరవ ప్రదంగా భావిస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు