Home సినిమాలు సంక్రాంతి బరిలో ప‌వ‌న్ కళ్యాణ్ చిత్రం.. ఇక రచ్చ రచ్చే

సంక్రాంతి బరిలో ప‌వ‌న్ కళ్యాణ్ చిత్రం.. ఇక రచ్చ రచ్చే

‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత రెండేళ్ల పాటు రాజకీయ ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ ఇస్తూనే వరుసగా మూడు సినిమాలకు ఓకే చెప్పిన పవన్.. వేగంగా ఈ మూవీ షూటింగ్స్ ఫినిష్ చేస్తున్నారు. కాగా, ఇందులో పవన్‌కల్యాణ్‌, డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఇక ప‌వ‌న్ కళ్యాణ్ కెరీర్ లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ వజ్రాల దొంగ పాత్రలో కనిపిస్తాడు. జౌరంగజేబు పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అనే టైటిల్ పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మార్చి 11న మహాశివరాత్రి పర్వదినాన దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. కాగా, ఇప్ప‌టికే సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ‘స‌ర్కారు వారి పాట’ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంద‌ని ప్ర‌క‌టించ‌గా, ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా కూడా సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌నుండ‌డంతో పోటీ రసవత్తరంగా మార‌నుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు