Home క్రీడలు షోయబ్‌ మాలిక్‌ బర్త్‌డే: వెరైటీగా విష్ చేసిన సానీయా మీర్జా

షోయబ్‌ మాలిక్‌ బర్త్‌డే: వెరైటీగా విష్ చేసిన సానీయా మీర్జా

అభిమానుల నుంచి ఎంతో వ్యతిరేకత, ఎన్నో వివాదాల సమక్ష్యంలోనే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ఏప్రిల్‌ 12, 2010న వివాహం చేసుకున్నాడు. వీరికి 2018లో ఇజ్జాన్ జన్మించిన విషయం తెలిసిందే.కాగా, షోయబ్‌ మాలిక్‌ నేడు 39 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, సానీయా మీర్జా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. “ఎవరు లేకపోతే నేను జీవించలేనో అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నీకు రోజులు, నెలలు, ఈ సంవత్సరమంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ముఖ్య విషయమేంటంటే నువ్వు ప్రాక్టీస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఇదంతా చెప్తాను. ఇంతకీ ఇది పుట్టినరోజు శుభాకాంక్షలేనా?, కాదంటావా? ఇదంతా పోనీ కానీ, ఐ లవ్‌ యూ” అని రాసుకొచ్చింది. దీనికి షోయబ్ తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది.

కాగా, 38 ఏళ్ల షోయబ్‌ టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి రిటైర్‌ అయిన సంగతి తెలిసిందే. టీ20లో మాత్రమే అతడు కొనసాగుతున్నాడు.ఇక షోయబ్‌ కెరీర్‌ విషయానికొస్తే.. పాకిస్తాన్‌ తరఫున 35 టెస్టులు, 287 వన్డేలు, 116 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఇప్పట్లో రిటైర్‌ అయ్యే ఆలోచన తనకు లేదని ఇటీవలే వెల్లడించిన అతడు‌.. పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 20- మార్చి 22 వరకు కరాచీలో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.  కరాజీ కింగ్స్‌, క్వెట్టా గ్లాడియేటర్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు