Home ప్రత్యేకం షాకింగ్‌ న్యూస్‌..అల్లు అర్జున్‌ కారావాన్‌కు ప్రమాదం..

షాకింగ్‌ న్యూస్‌..అల్లు అర్జున్‌ కారావాన్‌కు ప్రమాదం..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కార్‌వాన్‌కు ప్రమాదం జరిగింది. పుష్ప మూవీ షూటింగ్ పూర్తిచేసుకోని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. ఆయన కార్వాన్‏ను ఖమ్మం సమీపంలో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్‌ వేడయంతో వెనుకనుంచి మరో వావాహం వచ్చి ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో అల్లు అర్జున్‌ లేరని చిత్ర యూనిట్‌ ప్రకటించింది.కాగా..సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 

కాగా..అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయిక. ఇందులో బన్ని పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. అయితే ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ రాజమహేంద్రవరం సమీపంలోని మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో జరిగింది. తాజాగా ఈ షెడ్యూల్‌ పూర్తయింది.ఆగస్టు 13, 2021 ‘పుష్ప’ను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఆ సందర్భంగా ఆసక్తికర పోస్టర్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు