Home ప్రత్యేకం శ్రీరామ‌న‌వ‌మి రోజు ఆదిపురుష్ లుక్ ఎందుకు రిలీజ్ చేయలేదో తెలుసా..!

శ్రీరామ‌న‌వ‌మి రోజు ఆదిపురుష్ లుక్ ఎందుకు రిలీజ్ చేయలేదో తెలుసా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటిస్తున్నాడు. సీతగా కృతి సనన్‌ నటిస్తోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన స‌ర్‌ప్రైజ్ శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రానుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు

కానీ అభిమానుల ఆశలన్ని అడియాశలుగానే మిగిలాయి. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదిపురుష్‌ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ కు సంబంధించిన ఎలాంటి ఫస్ట్ లుక్ బ‌య‌ట‌కు రాలేదు. దీనికి ప‌లు కార‌ణాలు చెబుతున్నారు. ఇందులో ప్ర‌భాస్ లుక్ అంత‌గా ఆక‌ట్టుకునేలా లేదని, దీనిని చూసిన కృష్ణం రాజు కుటుంబ స‌భ్యులు ఆ ఫొటోను విడుద‌ల చేయోద్ద‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు క‌రోనా విజృంభిస్తున్న స‌మ‌యంలో రిలీజ్ చేయ‌డం మంచిది కాద‌ని భావించిన చిత్రబృందం విడుద‌ల‌ని కొద్ది రోజుల పాటు వాయిదా వేసార‌ని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు