Home సినిమాలు ‘శ్రీకారం’ రెండో రోజు కలెక్షన్స్: భారీగా తగ్గిన వసూళ్లు.. ఇలా అయితే కష్టమే!

‘శ్రీకారం’ రెండో రోజు కలెక్షన్స్: భారీగా తగ్గిన వసూళ్లు.. ఇలా అయితే కష్టమే!

సహాయ నటుడిగా తన కెరీర్‌ ప్రారంభించి మినిమమ్‌ గ్యారంటీ హీరోగా ఎదిగారు శర్వానంద్‌. వ్యవసాయం నేపథ్యంలో ఆయన నటించిన చిత్రం ‘శ్రీకారం’. బి. కిశోర్‌ దర్శకుడు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక.14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వ్య‌వ‌సాయం ప్రాధాన్య‌త‌ను తెలియజేస్తూ తెర‌కెక్కించిన ఈ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్‌తో ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతుంది. తొలి రోజు గురువారం (మార్చి 11) శ్రీకారం తెలంగాణ‌, ఆంధ‌ప్రదేశ్ రాష్ట్రాల్లో రూ.4.01 కోట్ల షేర్ రాబ‌ట్టిన‌ విషయం తెలిసిందే..కానీ ఈ చిత్రం రెండో రోజు చాలా తక్కువ వసూలు చేసింది. జాతిరత్నాలు పోటీ ఇస్తుండటంతో బాక్సఫీసు వద్ద కాస్త వెనకబడింది ఈ చిత్రం.

‘శ్రీకారం’ ఏరియాల వారిగా రెండు రోజుల రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ పరిశీలిస్తే.. 
★ నైజాం    :   1.69 కోట్లు
★ సీడెడ్    :   1.00 కోట్లు
★ ఉత్తరాంధ్ర :   0.76 కోట్లు
★ ఈస్ట్  గోదావరి   :  0.54 కోట్లు
★ వెస్ట్  గోదావరిల  : 0.34 కోట్లు
★ గుంటూరు  :   0.73 కోట్లు
★ కృష్ణా     :   0.29 కోట్లు
★ నెల్లూరు     :   0.20 కోట్లు
★ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజుల మొత్తం:  5.55 కోట్లు
★రెస్ట్ ఆఫ్ ఇండియా    : 0.18 కోట్లు
★ ఓవర్సీస్    : 0.25 కోట్లు
‘శ్రీకారం’ ప్రపంచవ్యాప్తంగా రేంజు రోజుల కలెక్షన్స్:  5.98 కోట్లు షేర్

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు