Home సినిమాలు 'శ్రీకారం' తొలి రోజు క‌లెక్షన్స్: భారీ వసూళ్లతో దూసుకుపోతున్న శర్వానంద్

‘శ్రీకారం’ తొలి రోజు క‌లెక్షన్స్: భారీ వసూళ్లతో దూసుకుపోతున్న శర్వానంద్

శర్వానంద్, ప్రియాంకా అరుళ్‌ మోహనన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం శ్రీకారం. కిశోర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మించారు. రావు ర‌మేశ్‌, న‌రేశ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. భూమికి, మనిషికి మధ్య ఉన్న ప్రేమకథే ఈ శ్రీకారం. మహాశివరాత్రి సందర్భంగా రిలీజైన ఈ సినిమా పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది. తొలి రోజు గురువారం (మార్చి 11) శ్రీకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.01 కోట్ల షేర్ రాబ‌ట్టిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం.

★ ‘శ్రీకారం’ సినిమా ప్రాంతాలవారిగా తొలిరోజు కలెక్షన్స్ రిపోర్ట్ పరిశీలిస్తే..
★ నైజాంలో – 1.10 కోట్లు
★ సీడెడ్ – 75లక్షలు
★ నెల్లూరు – 14 లక్షలు
★  కృష్ణ – 25 లక్షలు
★ గుంటూరు – 65 లక్షలు 
★వైజాగ్ – 54 లక్షలు
★ ఈస్ట్ గోదావరి- 30 లక్షలు
★ వెస్ట్ గోదావరి – 28 లక్షలు

కాగా.. తొలి రోజు 4.01 కోట్ల షేర్ రాబట్టిన ‘శ్రీకారం’ ఈ వీకెండ్ లో ఎలా నిలబడుతుందనేది చూడాలి. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ పై ప‌రిమిత బ‌డ్జెట్‌లో తెర‌కెక్కించిన శ్రీకారం త్వ‌ర‌లోనే బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకుంటుంద‌ని ప‌లువురు ట్రేడ్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు