Home సినిమాలు 'శ్రీకారం' ట్రైలర్ టాక్: "ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం..సేద్యం కూడా గెలవచ్చు.."

‘శ్రీకారం’ ట్రైలర్ టాక్: “ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం..సేద్యం కూడా గెలవచ్చు..”

యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘శ్రీ‌కారం’‌. కిశోర్ బి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ (‘నానీస్ గ్యాంగ్ లీడ‌ర్’ ఫేమ్‌) న‌టించారు. 14 రీల్స్ ప్లస్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ‘శ్రీ‌కారం’ను థియేట‌ర్లలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా ట్రైలర్ ను  యువ హీరోలు నితిన్‌, నాని, వరుణ్‌ తేజ్‌ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేసే యువకుడు గ్రామానికి వచ్చి ఎందుకు వ్యవసాయం చేశాడు? తెలియాలంటే ‘శ్రీకారం’ చిత్రాన్ని చూడాల్సిందే. శర్వానంద్‌ వ్యవసాయం గురించి చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. “ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం..సేద్యం కూడా గెలవచ్చు” అంటూ శర్వానంద్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. కాగా.. మిక్కీ జె. మేయర్‌ స్వరాలు అందించిన ఈ సినిమాలో  రావు రమేశ్‌, ఆమని, నరేశ్‌, మురళీ శర్మ, సత్య, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు