Home సినిమాలు 'శ్రీకారం' 'జాతిరత్నాలు' 'గాలి సంపత్' సినిమాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

‘శ్రీకారం’ ‘జాతిరత్నాలు’ ‘గాలి సంపత్’ సినిమాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

మహా శివరాత్రి కానుకగా(మార్చి 11న)  ‘శ్రీకారం’ ‘జాతిరత్నాలు’ ‘గాలి సంపత్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకే రోజు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కేవలం ఒక్క సినిమా మాత్రమే సత్తా చాటిందని తెలుస్తోంది. కాగా.. తొలి వారంలో ఈ మూడు సినిమాల కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

‘జాతిరత్నాలు’
చిన్న సినిమానే.. అది కూడా లో- బడ్జెట్ మూవీ.. పైగా ఎలాంటి భారీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా బరిలోకి దిగిన గల్లీ పోరగాళ్లు కలెక్షన్స్ వసూలు చేయడంలో నిజమైన ‘జాతిరత్నాలు’ అనిపించుకుంటున్నారు. కోట్లలో రాబడి తెస్తూ తమను నమ్మిన నిర్మాతల జేబులు నింపుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 23.09 కోట్లు షేర్ రూ. 36.90 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.18 కోట్లు.. ఓవర్సీస్ లో రూ. 3.43 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ‘జాతిరత్నాలు’ తొలి వారంలో రూ. 27.70 కోట్లు షేర్ తో పాటు రూ. 46 కోట్లు గ్రాస్ ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

‘శ్రీకారం’
శర్వానంద్, ప్రియాంక అరుళ్‌ మోహన్ జంటగా కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాతో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు కిషోర్. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి ఫిదా అయిపోతున్నారు.అయితే వసూళ్ల విషయానికి వచ్చేసరికి మాత్రం శ్రీకారం అంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నట్లు కనిపించడం లేదు. తొలిరోజు 4.30 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు చాలా తక్కువ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ‘శ్రీకారం’ తొలి వారంలో దాదాపు 8.44కోట్ల షేర్ తో 14.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 6 రోజుల్లో 9.13 కోట్ల షేర్ ను 15.50 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

‘గాలి సంపత్’
శ్రీవిష్ణు హీరోగా లవ్లీ సింగ్ హీరోయిన్ గా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్’. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ‘ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్’ మరియు ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ల పై ఎస్.కృష్ణ, హరీష్ పెద్ది,సాహు గరపాటి లు కలిసి నిర్మించారు. గాలి సంపత్ చిత్రం మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా రూ. 97 లక్షలు షేర్ తో 1.70 కోట్లు గ్రాస్ ను మాత్రమే ఈ సినిమా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు