Home సినిమాలు `శ్యామ్ సింగ‌రాయ్`లో ఆ భారీ సెట్ ఖర్చు ఎంతో తెలుసా?

`శ్యామ్ సింగ‌రాయ్`లో ఆ భారీ సెట్ ఖర్చు ఎంతో తెలుసా?

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ రూపొందిస్తోన్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్‌’. సాయిప‌ల్లవి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల.. హైదరాబాద్ ఔటర్ లోని 10 ఎకరాల్లో కోల్ కతా నగరాన్ని భారీ సెట్ రూపంలో నిర్మించారు. ఆరున్నర కోట్ల భారీ బడ్జెట్‌తో ప‌ది ఎక‌రాల్లో నిర్మించిన ఈ భారీ సెట్‌లో ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. హీరో నానితో పాటుగా ముఖ్యతారాగణంపై ప‌లు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సన్నివేశాలు చాలా  కీలకమైనవి కాబట్టి సెట్ కోసం అంత పెద్ద బడ్జెట్ ను ఖర్చు చేశారు మేకర్స్. కాగా, శ్యామ్‌ సింగ రాయ్‌ సినిమా ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై  అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఇక నాని కెరీర్‌లోనే ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. దీంతో నానికి ఈ మూవీ చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. అలాగే యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మరో యువ కథానాయకుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌. కీలక పాత్ర పోషిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు