Home సినిమాలు శివ‌రాత్రి స్పెష‌ల్ సర్‌ప్రైజ్.. ప్రభాస్ 'రాధేశ్యామ్' నుండి అదిరిపోయే పోస్ట‌ర్ రిలీజ్

శివ‌రాత్రి స్పెష‌ల్ సర్‌ప్రైజ్.. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నుండి అదిరిపోయే పోస్ట‌ర్ రిలీజ్

‘సాహో’ స్టార్‌ ప్రభాస్‌ వీర ప్రేమికుడిగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే అతడి మనసును దోచుకున్న ప్రేమికురాలిగా నటిస్తున్న చిత్రం “రాధేశ్యామ్‌”.రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ  ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరువుకోంటుంది. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమాని జూలై 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. అయితే, ఈ రోజు శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ చిత్రం నుండి ఆస‌క్తికర పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇది అభిమానులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 

ఇక ఈ సినిమాలో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ రోల్‌ పోషిస్తున్నారు. పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దక్షిణాదిలో జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ 20వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు