Home సినిమాలు శివుడి సాక్షిగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న పవన్.. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ రిలీజ్

శివుడి సాక్షిగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న పవన్.. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ రిలీజ్

టాలీవుడ్ యాక్ట‌ర్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌-క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు ఉన్నాయి. పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 11న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసింది.

ఇదిలావుంటే.. పవన కళ్యాణ్ తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’ ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌గా రూపొందుతోంది. శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కొన్నాళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. తన కెరీర్‌లో తొలిసారి లాయర్‌ పాత్ర పోషిస్తున్నారాయన. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు