Home ప్రత్యేకం శివరాత్రి స్పెషల్ గిఫ్ట్: 'ఈశ్వరా' అంటూ కృతి శెట్టి చేసిన నాట్యానికి ఫిదా అవ్వాల్సిందే..!

శివరాత్రి స్పెషల్ గిఫ్ట్: ‘ఈశ్వరా’ అంటూ కృతి శెట్టి చేసిన నాట్యానికి ఫిదా అవ్వాల్సిందే..!

సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్స్ తొలి సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకుంటారు. అలాంటి వారి జాబితాలో చేరిపోయింది ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి. ఈ సినిమాలో డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ సరసన రొమాన్స్ చేసి తనలోని నటనా ప్రతిభను తెలుగు ప్రేక్షకుల ముందుంచింది. ఎమోషన్ సీన్స్‌లో అద్భుతమైన నటన కనబర్చింది. దీంతో తెలుగు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడింది. కన్నడ భామనే అయినా ఈ బ్యూటీకి వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి.

ఇదిలా ఉండగా.. కృతి చిన్నప్పుడు నాట్యం నేర్చుకుందని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది. ఇప్పుడు ఆమెలోని నాట్యకళను ‘ఈశ్వరా’ అనే పాటతో బయటపెట్టే ప్రయత్నం చేసింది. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా కృతిశెట్టి విడుదల చేసిన ఈశ్వరా అనే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం కృతి కూచిపూడి నాట్యకళను చూస్తూ అభిమానులు వారెవ్వా అంటున్నారు.

మరోవైపు ప్రస్తుతం కృతి శెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే నాని సినిమాలో అవకాశం వచ్చింది. ‘టాక్సీవాలా’ ఫేమ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, నాని కాంబినేషన్‌లో వస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్‌’ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిన కృతి.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రానున్న కొత్త సినిమాలో కూడా హీరోయిన్‌గా అవకాశం పట్టేసిందనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు