Home ప్రత్యేకం శశికళకు రజనీకాంత్ ఫోన్..రసవత్తరంగా మారిన తమిళ రాజకీయలు

శశికళకు రజనీకాంత్ ఫోన్..రసవత్తరంగా మారిన తమిళ రాజకీయలు

వి.కె. శశికళ.. తమిళనాట అందరికీ తెలిసిన పేరు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా ఎక్కువ గుర్తింపు పొందారు. జయలలిత మరణం తర్వాత తమిళనాడు సీఎం పదవికి తనే అర్హురాలిగా తెరపైకి వచ్చారు. కానీ, రాజకీయ చదరంగంలో ఓడిపోయారు. అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు. ఆమెది ఇక అధ్యాయం ఇక ముగిసింది అని చాలా మంది అనుకున్నారు. కానీ, బెబ్బులిలా మళ్ళీ తిరిగొచ్చారు. కొద్ది రోజుల కిందట జైలు నుంచి విడుదలైన శశికళ ఫిబ్రవరి 8న చెన్నైకి చేరుకున్నారు. బెంగళూరు నుంచి సుమారు 350 కిలోమీటర్ల దూరం వందలాది వాహనాల్లో అనుచరులు, సన్నిహితులు అనుసరిస్తుండగా తమిళనాడులో ఘనంగా అడుగుపెట్టారు. రాజకీయాల్లో ఘనంగా పునరాగమనం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

కాగా,తమిళనాడుకు చేరుకున్న  శశికళకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని ఏఎంఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, శశికళ సమీప బంధువు టీటీవీ దినకరన్‌  వెల్లడించారు. “ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ నాకు ఫోన్ చేశారు. శశికళ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సుదీర్ఘ ప్రయాణం చేసి ఆమె ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు” అని దినకరన్ మీడియాకు వెల్లడించారు.అయితే,శశికళకు రజనీ ఫోన్ చేయడం పట్ల తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. కొద్ది రోజుల క్రితం రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ అనంతనం విరమించుకున్న విషయం తెలిసిందే. మరి శశికళకు రజనీ ఫోన్ చేయడం పట్ల ఏదైనా రాజకీయం ఉందా అనే కోణంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు