Home సినిమాలు శర్వానంద్ 'శ్రీకారం' మూవీ రివ్యూ:

శర్వానంద్ ‘శ్రీకారం’ మూవీ రివ్యూ:

నటీనటులు : శర్వానంద్‌, ప్రియా అరుళ్‌ మోహన్‌, సాయికుమార్‌, మురళీశర్మ, రావు రమేశ్‌, నరేశ్‌, ఆమని, సప్తగిరి తదితరులు. నిర్మాతలు : రామ్‌ ఆచంట, గోపీ ఆచంట | దర్శకత్వం : బి.కిషోర్‌ |సంగీతం : మిక్కీ జె.మేయర్.

శర్వానంద్ హీరోగా కిశోర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్  ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది . అయితే, తాజాగా.. నేడు శుక్రవారం (మార్చి 11న) ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది ఈ మూవీ. మరి ‘శ్రీకారం’ ఎలా ఉంది.. కొత్త దర్శకుడు కిషోర్ చెప్పిన ‘ఉమ్మడి వ్యవసాయం’ కాన్సెప్ట్ ఎలా ఉంది? శర్వానంద్ మరో హిట్‌కి ‘శ్రీకారం’ చుట్టారా? అన్నది ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
చిత్తూరు జిల్లాలోని అనంతరాజపురానికి చెందిన రైతు కేశవులు(రావు రమేష్) కొడుకు కార్తీక్ (శర్వానంద్) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. చక్కటి పనితనంతో ఆఫీస్‌లో అందరి మన్ననలు పొందుతాడు. కార్తీక్‌ను ప్రేమలో పడేసేందుకు చైత్ర(ప్రియాంకా అరుళ్‌ మోహన్) ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే కార్తీక్ మాత్రం ఆమెను పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతుంటాడు. అయితే ఒక ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతం చేయడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని అమెరికా పంపించాలని నిర్ణయం తీసుకుంటుంది. కానీ కార్తీక్ మాత్రం ఉద్యోగం మానేసి వ్యసాయం చేయడానికి తన గ్రామానికి వెళ్తాడు. వ్యవసాయం వద్దు బాబోయ్ అని వదిలేసిన కొంత మంది రైతులతో కలిసి ఉమ్మడి వ్యవసాయం మొదలు పెడతాడు. అసలు కార్తిక్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం వైపు ఎందుకు వచ్చాడు? ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి? ఉమ్మడి వ్యవసాయంలో ఎదురైన సమస్యలను కార్తిక్‌ ఎలా అధిగమించాడు? అనేది థియేటర్లలో చూడాల్సిందే…
విశ్లేషణ:
వ్యవసాయాన్ని ఓ ఉద్యోగంగానో, వ్యాపారంగానో ఎవరూ చూడటం లేదు.. వ్యవసాయంలో నష్టాలు వస్తుండటంతో ఇటువైపు ఆసక్తి చూపడం లేదు. ఒక్కొక్కరుగా కాకుండా ఊర్లోని అందరూ కలసి ఉమ్మడి వ్యవసాయం చేయాలి.. వచ్చిన లాభాలను సమానంగా పంచుకోవాలి. అలా చేయడం వల్ల ఎవరూ నష్టపోరని చెప్పే ప్ర‌య‌త్న‌మే ‘శ్రీకారం’. తినేవాళ్లు నెత్తిమీద జుట్టంత సంఖ్యలో ఉంటే.. పండించే వాళ్లు మూతిమీద మీసం అంత క‌నిపిస్తున్న ఈ ప‌రిస్థితుల్లో  వ్య‌వ‌సాయదారుల జీవితాలు ఎలా మారిపోయాయనే విష‌యాల్ని క‌ళ్ల‌కి క‌ట్టిన‌ట్టుగా చూపించడంలో విజయం సాధించాడు ద‌ర్శ‌కుడు కిషోర్.

అలాగే ఒక రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన యువ‌కుడి పాత్రలో శర్వానంద్ చక్క‌గా ఒదిగిపోయాడు.  ఆయ‌న పాత్ర చుట్టూనే ఈ క‌థ న‌డుస్తుంది. భావోద్వేగాలు పండించ‌డంలో ఆయ‌న మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటి చెప్పారు.  రావు ర‌మేష్‌, సాయికుమార్‌, న‌రేష్ కీలక పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. సాయికుమార్ ఏకాంబ‌రంగా ప్రతినాయక పాత్ర‌ని చేశారు. స‌త్య కామెడీ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహ‌న్ అందంగా క‌నిపించింది. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. యువ‌రాజ్ కెమెరా ప‌నిత‌నం, మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం,  బుర్రా సాయిమాధ‌వ్ డైలాగ్స్ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. మొత్తంగా ‘శ్రీకారం’ మంచి సందేశాత్మక మన ఊరి కథ..

ప్లస్ పాయింట్స్:క‌థ‌, కథనంశర్వానంద్‌ నటన,సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్
మైనస్‌ పాయింట్స్‌:సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు
రేటింగ్: 3/5

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు