Home సినిమాలు శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌ చిరంజీవి..

శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌ చిరంజీవి..

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. రావు రమేష్, వీకే నరేష్, మురళీ శర్మ, సాయికుమార్, ఆమని వంటి సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. సాయికుమార్ ప్రతినాయకుడు పాత్ర పోషించడం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ లో సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటున్నాయి.

రైతు గొప్పతనాన్ని, వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియజేసే కథాంశంతో ‘శ్రీకారం’ చిత్రం తెరకెక్కుతుంది. కాగా.. ఈ సినిమాకు సంబంధించి మార్చి 8న ఖమ్మంలో జరిగే గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతుంటే.. మార్చి 9న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్‌ పాల్గొననున్నారు. ఈ విషయం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు