Home సినిమాలు శర్వానంద్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌.. వైరల్‌గా మారిన ఫొటోలు

శర్వానంద్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌.. వైరల్‌గా మారిన ఫొటోలు

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్‌ నేడు 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శర్వానంద్‌కి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు, స్నేహితులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో శర్వానంద్‌కు చిన్ననాటి స్నేహితుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ తేజ్‌ స్పెషల్‌ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా చెర్రీ శుక్రవారం రాత్రి బర్త్‌డే బాయ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా పార్టీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శర్వానంద్ తాజాగా సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘పార్టీ ఇచ్చినందుకు థ్యాంక్యూ చెర్రీ’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఆచార్య సినిమాకు సంబంధించి తన షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న రామ్‌ చరణ్‌, తాజాగా భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు శర్వానంద్‌ ప్రస్తుతం ‘శ్రీకారం’ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. కిషోర్‌.బి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మార్చి 11న విడుదల కానుంది. దీనితోపాటు ‘మహాసముద్రం’ సినిమాలోను ఆయన నటిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు