Home ప్రత్యేకం శంకర్-చరణ్ మూవీ లేటెస్ట్ అప్‌డేట్: ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కి పండగే పండగ

శంకర్-చరణ్ మూవీ లేటెస్ట్ అప్‌డేట్: ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కి పండగే పండగ

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమా చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇదిలాఉంటే.. శంకర్ సినిమా అంటే.. సందేశాత్మక అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుంది. భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీ  సినిమాల మాదిరిగా భారీ స్థాయిలో రూపొందనుందని తెలిసింది. ఇక రామ్ చరణ్‌ క్యారెక్టర్ విషయానికి వస్తే.. పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. దీని కోసం పవర్ ఫుల్ డైలాగ్స్ రాయడం కోసం రైటర్ వివేక్ ను తీసుకున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వివేక్ ఇంతకు ముందు అదిరింది, విజిల్ దర్బార్, ఇంకొక్కడు, ఆకాశం నీ హద్దురా, జగమే తంత్రం తదితర సినిమాలకు వర్క్ చేసారు. ఇప్పుడు రామ్ చరణ్‌ – శంకర్ సినిమాకు వివేక్ డైలాగ్స్ – స్క్రీన్ ప్లే అందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అలానే ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ ని ఫైనలైజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద భారీ క్యాస్టింగ్ తో భారీ వీఎఫ్ఎక్స్ ఇతర సాంకేతికతతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు శంకర్ – చరణ్ – దిల్ రాజు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమాను జూలై లేదా ఆగస్టు నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు