Home ప్రత్యేకం శంకర్‌-చరణ్‌ మూవీ క్రేజీ అప్‏డేట్: అతిథి పాత్రలో మెగాస్టార్, సూపర్ స్టార్!

శంకర్‌-చరణ్‌ మూవీ క్రేజీ అప్‏డేట్: అతిథి పాత్రలో మెగాస్టార్, సూపర్ స్టార్!

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో సెన్సేషనల్ కాంబోకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమా చిత్ర ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా  కొరియాకు చెందిన నటి సుజీ బే నటించనుందని వార్తలొస్తున్నాయి..

అలాగే ఈ సినిమాలో అతిథి పాత్రల్లో మెగాస్టార్‌ చిరంజీవి, బాలీవుడ్‌ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ నటించనున్నారని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూలైలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ భారీ పాన్ ఇండియా మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో రూపొందుతోన్న 50వ సినిమా ఇది. అలాగే, రామ్ చరణ్‌కు 15వ చిత్రం. ఇదిలాఉంటే.. ఈ సినిమా కోసం దర్శకుడు శంకర్‌  ఓ పవర్‌ ఫుల్‌ పొలిటికల్‌ స్క్రీప్ట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కథ నిజాయితీ గల ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ చూట్టు తిరిగే పొలిటికల్‌ జానర్‌గా రూపొందనున్నట్లు సమాచారం.

 

 

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు