Home ప్రత్యేకం శంకర్‌-చరణ్‌ మూవీ: ఊహించని పాత్రలో మెగాపవర్ స్టార్!

శంకర్‌-చరణ్‌ మూవీ: ఊహించని పాత్రలో మెగాపవర్ స్టార్!

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమా చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్‌చరణ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం.
వాస్తవానికి తండ్రి పాత్రలో సౌత్ ఇండస్ట్రీలో లో చిరంజీవి, నార్త్ ఇండస్ట్రీలో అమితాబ్‌ బచ్చన్‌ నటించనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇందులో తండ్రి పాత్రను కూడా రామ్ చరణే చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం చెర్రీపై టెస్ట్‌ షూట్‌ కూడా చేశారని, దానికి డైరెక్టర్ శంకర్‌ కూడా సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. కాగా, రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల చిత్రీకరణ  పూర్తయిన వెంటనే రామ్‌చరణ్‌ నేరుగా శంకర్‌ సినిమా సెట్స్ లోకి వెళ్లనున్నాడని సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు