Home సినిమాలు వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పలు రికార్డులను తిరగరాసింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ను లాభాల్లో ముంచెత్తింది. లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగానూ నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్‌ సేతుపతి నటన ఈ సినిమా విజయానికి ప్లస్‌ అయింది. విలన్‌ పాత్రలో కనిపించిన విజయ్‌ సేతుపతి యాక్టింగ్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్‌లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగానూ ఉప్పెన రికార్డులు సృష్టిస్తోంది.

అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా.. అనుకున్నదానికంటే డబుల్ కలెక్షన్స్ తీసుకొచ్చిందట. అలాగే వరుస హిట్స్ లో ఉన్నారు మైత్రి నిర్మాతలు. తాజాగా ఈ సినిమా హీరో హీరోయిన్లకు భారీ గిఫ్ట్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట నిర్మాతలు. హీరో వైష్ణవ్ తేజ్ కు ఓ కోటి రూపాయలు అలాగే హీరోయిన్ కృతికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఇవి వారి రెమ్యూనరేషన్ కాకుండా అదనంగా ఇస్తున్నారట. ప్రస్తుతం మైత్రి వారి బహుమానం గురించి ఇండస్ట్రీ మొత్తం చర్చలు నడుస్తున్నాయి. అలాగే ఉప్పెనతో మంచి హిట్ సినిమా అందించిన డైరెక్టర్ బుచ్చిబాబుకు ఇప్పటికే నిర్మాతలు కారు లేదా ఇల్లు ఆఫర్ చేశారట. అంతేగాక బుచ్చిబాబుతో మరో రెండు సినిమాలకు కూడా సంతకం చేయించుకున్నట్లు తెలుస్తుంది.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు