Home సినిమాలు వైల్డ్ డాగ్ Vs సుల్తాన్: నాగార్జునను ప్రత్యేకంగా కలిసి థ్యాంక్యూ చెప్తా అంటున్న కార్తీ

వైల్డ్ డాగ్ Vs సుల్తాన్: నాగార్జునను ప్రత్యేకంగా కలిసి థ్యాంక్యూ చెప్తా అంటున్న కార్తీ

ఏప్రిల్ 2న కింగ్ నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’.. యువ హీరో కార్తి నటించిన ‘సుల్తాన్’ సినిమాలు విడుదల కానున్నాయి. గతకొన్ని రోజులుగా ప్రమోషన్స్ తో అదరగొడుతున్న వైల్డ్ డాగ్ చిత్రంలో స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌వర్మగా నాగార్జున నటించారు. నాగ్‌ టీమ్‌ను దర్శకుడు అహిషోర్‌ సోలమన్‌ స్క్రీన్‌పై వీరోచితంగా చూపించనున్నారు. ఇక మరోవైపు కార్తీ, రష్మికా జంటగా ‘సుల్తాన్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ పతాకంపై బక్కియరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడదలైన సినిమా ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.

కాగా, ఇటీవల వైల్డ్ డాగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ మా సినిమా విడుదల అవ్వబోతున్న రోజునే నా తమ్ముడు కార్తీ నటించిన సుల్తాన్ కూడా విడుదల కాబోతుంది. మా సినిమా తో పాటు తమ్ముడు కార్తీ సుల్తాన్ సినిమా కూడా విజయాన్ని అందుకోవాలంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, నాగార్జున మాటలతో కార్తీ ఉబ్బితబ్బిబయిపోయాడు. అంత పెద్ద స్టార్ తమ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో అంత మంది ముందు సుల్తాన్ పేరు ఎత్తడం మామూలు విషయం కాదు. అది కూడా తన సినిమాకు పోటీగా రాబోతున్న సినిమాకు శుభాకాంక్షలు చెప్పడంతో నాగార్జున అందరి మనసులు గెలుచుకున్నాడు.
తాజాగా కార్తీ సుల్తాన్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఆ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున వ్యాఖ్యలపై కార్తీ స్పందించాడు. ఈ ఇంటర్వ్యూలో నాగార్జున గారికి కృతజ్ఞతలు చెప్తే సరిపోదు. ఆయన్ను వీలు చూసుకుని కలిసి ప్రత్యేకంగా థ్యాంక్యూ చెప్తానంటూ ఈ సందర్బంగా కార్తీ చెప్పుకొచ్చాడు. కాగా, అంతకుముందు వీరిద్దరు కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపిరి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

 

 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు