అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాత. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించాడు. ఈ నేపథ్యంలో వైల్డ్ డాగ్ చిత్రం ఏప్రిల్ 2న విడుదలైంది. అయితే ఈ సినిమాకి తొలి రోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది
వైల్డ్ డాగ్ సినిమా తొలి రోజు దాదాపు రూ. 3.5 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. ఇక యూఎస్ఏలో కూడా వైల్డ్ డాగ్ జోరు కొనసాగుతుంది. తొలి రోజే అక్కడ 3,967 డాలర్లను వసూలు చేసింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 7.7 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. నైజాంలో 2.5 కోట్లు, సీడెడ్‌లో 1.2 కోట్లు, ఆంధ్రాలో 4 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తోంది. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షలు, ఓవర్సీస్ హక్కులు రూ.50 లక్షలకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి వైల్డ్ డాగ్ సినిమా 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ చిత్రం సేఫ్‌లో జోన్లోకి వెళ్లాలంటే ఇంకా 5.5 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయాల్సివుంది.