Home సినిమాలు వేలంటైన్స్ డే గిఫ్ట్: 'ల‌వ్‌స్టోరి' నుంచి సాంగ్ రిలీజ్

వేలంటైన్స్ డే గిఫ్ట్: ‘ల‌వ్‌స్టోరి’ నుంచి సాంగ్ రిలీజ్

యువ కథానాయకుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌ హీరోగా  శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ప్రేమ‌క‌థా చిత్రం ‘ల‌వ్‌స్టోరి. సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా నటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ‘ఫిదా’ త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా, ఫిబ్రవరి14న ప్రేమికుల రోజున ‘లవ్‌ స్టోరీ’ చిత్రబృందం ప్రేమికులకు అద్భుతమైన మెలోడి సాంగ్‌ను కానుకగా ఇచ్చింది. ఈ సినిమాలో ‘నీ చిత్రం చూసి..’అంటూ సాగుతున్న సాంగ్‌ లిరికల్‌ వీడియో విడుదల చేశారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించిన ఈ గీతానికి సంగీత దర్శకుడు పవన్‌ సీహెచ్‌ స్వరకల్పన చేశారు. మిట్టపల్లి సురేందర్‌ సాహిత్యానందించారు. ఇప్పటికే ఇందులోని ‘ఏయ్‌ పిల్లా..’అనే పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అలాగే తాజాగా విడుదలైన ‘నీ చిత్రం చూసి..’ పాట ప్రేమికుల గుండెల్ని పిండేస్తోంది. మరి ఈ పాటను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు