Home ప్రత్యేకం వేట కొడవలితో ఊర నాటుగా ‘పుష్ప’రాజ్.. ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా 40 కోట్లు

వేట కొడవలితో ఊర నాటుగా ‘పుష్ప’రాజ్.. ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా 40 కోట్లు

టాలీవుడ్ లో ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం “పుష్ప”. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాల్లో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు‌. రష్మికా మందన్నా పల్లెటూరి యువతిగా కనిపించనుండగా ఫాహద్‌ ఫాజిల్‌ విలన్ పాత్ర పోషిస్తున్నాడు‌. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘పుష్ప’ చిత్రంలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారట చిత్రబృందం. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 40 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు పెడుతున్నారట మేకర్స్. దీంతో అప్పడే ఈ భారీ యాక్షన్ సీన్స్ పుష్ప చిత్రంలో ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కాగా, ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.  మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప ఆగస్టు 13న విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు