Home ప్రత్యేకం వెండితెరపై 'కింగ్ మేకర్'గా మెగాస్టార్!

వెండితెరపై ‘కింగ్ మేకర్’గా మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆచార్య సెట్స్ లో ఉండ‌గా.. వేదాళ‌మ్‌, లూసిఫ‌ర్ రీమేక్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. వీటితోపాటు బాబీ డైరెక్ష‌న్‌లో కూడా సినిమాను ఒకే చేశాడు. అయితే వీటన్నిటిలో అత్యంత క్రేజ్ ఉన్న సినిమా ‘లూసిఫ‌ర్’. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి స్టార్ డమ్ కు తగ్గట్టు ఈ చిత్రానికి  ‘కింగ్ మేకర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ‘ఆన్న’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో పంచెకట్టులో ఫుల్ లెంగ్త్ రోల్ లో చిరంజీవి కనపడబోతున్నారు.

కాగా, కొణిదెల ప్రొడక్షన్స్‌పై సురేఖ కొణిదెల సమర్పణలో ఈ చిత్రాన్ని ఆర్‌.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘లూసిఫర్‌’ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్నారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 13న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యేలోపు ‘లూసిఫర్‌’ సినిమా చిత్రీకరణను ప్లాన్‌ చేస్తున్నారు చిరంజీవి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు