Home వార్తలు విస్తరిస్తున్నకరోనా కొత్త స్ట్రైన్ …..లాక్ డౌన్ యోచనలో ముంబై

విస్తరిస్తున్నకరోనా కొత్త స్ట్రైన్ …..లాక్ డౌన్ యోచనలో ముంబై

ఒక పక్క టీకా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.  మరో పక్క కరోనా కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి.  మూడు రోజులు గా  దేశం లో16000 కరోనా కేసులు వస్తున్నాయి.  కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో 16488 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,10, 79, 979 కి చేరింది. 

మహారాష్ట్రలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది.  మహారాష్ట్రలో ఇప్పటికే అనేక జిల్లాలలో లాక్ డౌన్ విధించారు.  ఈ నేపథ్యంలో, కేంద్రం తాజాగా మరో సారి కోవి డ్ మార్గదర్శకాలు విడుదుల చేసింది.  నిబంధనలు మార్చ్ 31 వరకు పొడిగించింది.  సెకండ్ వేవ్ అన్న అనుమానాలతో దేశ వ్యాప్తం గా కరోనా ఆంక్షలను కఠిన తరం చేసింది కేంద్రం. 

2020 మార్చ్ లో విజృంభించడం, ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం మనందరికీ గుర్తుండే ఉంటుంది.  మళ్ళి 2021 మార్చ్ వస్తోంది.  వైరస్ ఎన్నో అంతు చిక్కని రూపాలను సంతరించుకుంటోందని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాక్సిన్ వచ్చిందన్న నిర్లక్ష్యం వద్దు.   మాస్క్ లను ధరించడం, చేతులు శుభ్రం గా కడుక్కోవడం, ఫీజికల్ డిస్టెన్స్ పాటించడం మర్చిపోవద్దు.  అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పోషకాహారం తీసుకోండి.  మన ఆరోగ్యం మన చేతుల్లోనే

మన అజాగ్రత్త మన దేశ ఎకానమీ మీద కూడా పడుతుంది.  జాగ్రత్తగా ఉండండి

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు