Home సినిమాలు విశ్వ‌క్ సేన్ 'పాగల్' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

విశ్వ‌క్ సేన్ ‘పాగల్’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

‘హిట్‌’ వంటి హిట్‌ చిత్రం తర్వాత విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘పాగల్‌’. ఈ చిత్రం ద్వారా నరేష్‌ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు రథన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.విశ్వక్‌ సేన్‌ సరసనహీరోయిన్ గా కొత్త అమ్మాయిని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం.తాజాగా ‘పాగ‌ల్’ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు చిత్రబృందం. ఇందులో విశ్వ‌క్ సేన్ సరికొత్త లుక్‌లో క‌నిపిస్తూ అభిమానుల‌కి ఆనందాన్ని అందిస్తున్నాడు. 

కాగా,ఏప్రిల్ 30న ‘పాగల్’ చిత్రాన్ని థియేట‌ర్‌లోకి తీసుకు రానున్న‌ట్టు మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్ ద్వారా తెలియ‌జేశారు.  “హిట్” కు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా అద్భుతమైన విజువల్స్ అందించిన మణికందన్  మరొకసారి ఈ సినిమాకు పని చేస్తూ ఉండగా, “గూఢచారి” వంటి సెన్సేషనల్ హిట్ సినిమాలతో పాటు ప్రస్తుతం వస్తున్న అనేక హిట్ సినిమాలకు ఎడిటింగ్ చేస్తున్న గ్యారీ సర్ పాగ‌ల్‌కు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.ఈ నేపథ్యంలో బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ– ‘‘విశ్వక్‌తో ‘పాగల్‌’ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.ఒక క్రేజీ సబ్జెక్టుతో ఈ చిత్రం తీస్తున్నాం. నరేష్‌ లాంటి ప్రతిభావంతుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు.‘‘నరేష్‌ చెప్పిన స్క్రిప్ట్‌ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో ‘పాగల్‌’ చిత్రాన్ని అంగీకరించా. సరికొత్త జానర్‌లో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు విశ్వక్‌సేన్‌.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు