Home క్రీడలు విరుష్క జోడీ కూతురికి అదిరిపోయే వెల్​కమ్

విరుష్క జోడీ కూతురికి అదిరిపోయే వెల్​కమ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకి పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ పాప పేరు ‘వామిక’ అని పెట్టారు. ఇటీవలే వామిక లుక్ ని విరుష్క జంట అభిమానులకు ప్రదర్శించారు. అయితే, తాజాగా ఓ హోటల్ వాళ్లు.. వామికకు ఘనంగా వెల్ కం చెబుతూ ఏకంగా స్వీట్ హోమ్ అంటూ.. విరుష్కకు కేటాయించిన గది ముందు నేమ్ ప్లేట్ లో వామిక పేరును వేయడం ద్వారా తమ అభిమానాన్ని కురిపించారు.

కాగా..అహ్మదాబాద్ లో విరాట్ కోహ్లీకి కేటాయించిన హోటల్ గది వద్ద ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఇలా నేమ్ ప్లేట్ పైభాగంలో `హోమ్ స్వీట్ హోమ్` అని రాసిన హోటల్ వాళ్లు వామికా కోసం ప్రత్యేకంగా నేమ్ ప్లేట్ ని డిజైన్ చేయించారు. నిజంగా ఇది వామికకు గ్రాండ్ వెల్కం అనే చెప్పాలి. 

ఇదిలాఉంటే.. ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. ఆ తర్వాత ఐదారేళ్లు లవ్‌లో ఉన్నారు. అనంతరం 2017, డిసెంబరులో వివాహ బంధంతో ఈ ఇద్దరూ ఒకటవగా.. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఒకేసారి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో విరుష్క జోడీ పంచుకుంది. ఈ క్రమంలోనే జనవరిలో అనుష్క శర్మకి పాపకి జన్మనిచ్చింది.. అయితే అనుష్క శర్మ డెలివరీ సమయంలో ఆమె చెంత ఉండేందుకు ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే పెటర్నటీ లీవ్‌పై విరాట్ కోహ్లీ భారత్‌కి వచ్చేసిన సంగతి తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు