Home ప్రత్యేకం విడుదలకు ముందే 'వకీల్ సాబ్' హంగామా.. బాక్సాఫీస్‌ని దున్నేసిన పవర్ స్టార్!

విడుదలకు ముందే ‘వకీల్ సాబ్’ హంగామా.. బాక్సాఫీస్‌ని దున్నేసిన పవర్ స్టార్!

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ `వకీల్‌ సాబ్` సినిమా ఏప్రిల్ 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటించగా.. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషించారు. కాగా, ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లోనే 18 మినిలియన్లకు పైగా వ్యూస్.. 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. తెలుగు సినీపరిశ్రమలో ఏ సినిమా ఇలాంటి రికార్డు సాధించలేదు. వకీల్ సాబ్ జోరు చూస్తుంటే రిలీజ్ తర్వాత బాక్సఫీసు వద్ద కొత్త చరిత్ర నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమాను ఏప్రిల్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2000 థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నారు. దాంతో పాటు విదేశాల్లో 700 స్క్రీన్స్ లో విడుదల కాబోతుంది. కరోనా తర్వాత ఇంత భారీగా విడుదలవుతున్న తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో దాదాపు 94 శాతం థియేటర్లలో టిక్కెట్లన్నీ అమ్ముడయిపోయాయట. మిగిలిన ప్రాంతాల్లో ఓపెన్ చేసిన గంటల్లోనే అయిపోయాయట. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమాకూ ఇలా టిక్కెట్లు బుక్ కాలేదని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు