Home ప్రత్యేకం విడుదలకు ముందే 'ఆచార్య'కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌ స్టార్‌ రామ్ చరణ్ కూడా నటించనున్న విషయం తెలిసిందే. సిద్ధ అనే పాత్రలో చరణ్‌ కనిపించనున్నాడు. ఇందులో చెర్రీ సరసన బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది.

ఇదిలాఉంటే.. ఈ సినిమా నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల  ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో నక్సలైట్లు దారుణానికి పాల్పడ్డారు. సుక్మా, బిజాపూర్ సరిహద్దు వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతాసిబ్బంది  నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో నక్సల్స్‌ కాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టారు. ఈ ఘటనలో నక్సల్స్‌ 22మంది భద్రతాసిబ్బంది ప్రాణాలను బలిగొన్నారు. ఇది జరిగాక నక్సలైట్లపై పెద్దఎత్తున వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రభావం ఇప్పుడు ఆచార్య,  సినిమాపై కూడా పడింది.
‘ఆచార్య’ చిత్రంలో ఛత్తీస్‌గఢ్‌ ఘటనను అనుసరించి  నక్సలైట్స్ ను పాజిటివ్ గా చూపించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యాంటీ టెర్రరిజం ఫోరమ్స్(ఏటిఎఫ్) వారు హైదరాబాద్ లోని సెన్సార్ బోర్డును కలిసి సూచించారు. ఒకవేళ అలా ఉంటే కనుక ఆ ఆచార్య సినిమాకు సెన్సార్ చెయ్యకూడదని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సినిమాలు తీయరాదని తెలిపారు. మరి దీనిపై ఆచార్య చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో అన్నది చూడాలి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు