Home సినిమాలు వింత వ్యాధితో బాధపడుతున్న కాజల్ అగర్వాల్..షాక్ లో ఫ్యాన్స్!

వింత వ్యాధితో బాధపడుతున్న కాజల్ అగర్వాల్..షాక్ లో ఫ్యాన్స్!

‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్‌కి పరిచయమైన కాజల్‌ అగర్వాల్‌ తమిళ్, హిందీ భాషల్లోనూ దూసుకెళ్తుంది.గతేడాది అక్టోబర్‌ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. సడెన్‌గా కాజల్‌ తన ప్రేమ, పెళ్లి విషయం చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేయడంతో వీరిద్దరి టాపిక్‌ కొంతకాలం వరకు టాలీవుడ్‌లో సెన్సేషనల్‌గా మారింది. పెళ్లి తర్వాత కూడా కాజల్  అగర్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే చందమామ చేతిలో.. చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ భారతీయుడుతో పాటు హిందీలో ‘ముంబాయి సాగా’ సినిమాలో నటిస్తోంది. సినిమాలతోపాటు కాజల్‌ తన వ్యక్తిగత జీవితానికి కూడా ఎక్కవగానే ప్రధాన్యతే ఇస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా భర్త గౌతమ్‌తో సమయం గడుపుతోంది. అంతేగాక ఇప్పుడిప్పుడే తన విషయాలను బయటకు వెల్లడిస్తోంది.

ఇదిలావుండగా..కాజ‌ల్‌కు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు బ్రాంకియల్ ఆస్తమా బారినపడిందట. దీని వ‌ల‌న ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్తలు తీసుకోవ‌లసి వ‌చ్చేద‌ట‌. శీతాకాలం వ‌స్తే  బ్రాంకియల్ ఆస్తమా లక్షణాలు మ‌రింత ఎక్క‌వు కావ‌డంతో తాను చాలా ఇబ్బందులు పడినట్టు చెప్పుకొచ్చింది కాజ‌ల్. అయితే బ్రాంకియల్ ఆస్తమా నుండి బ‌య‌ట ప‌డేందుకు ఇన్‌హేల‌ర్ వాడ‌గా, అది బాగా ప‌ని చేసింద‌ని కాజ‌ల్ పేర్కొంది. అయితే, ఇప్ప‌టికీ నా వెంట ఓ ఇన్‌హేల‌ర్ ఉంటుంది. మ‌న‌దేశంలో చాలా మందికి కూడా ఇన్‌హేల‌ర్ అవ‌స‌రం ఉంటుంది. కాని దానిని వాడ‌డానికి సిగ్గుప‌డుతుంటారు. ఎవ‌రు ఏమ‌నుకుంటారో అని ఫీల్ అవుతుంటారు. వాటికి స్వ‌స్తి చెబుదాం,  సే ఎస్ టు ఇన్ హేలర్స్ అందాం అని సోషల్ మీడియాలో కాజ‌ల్‌ పేర్కొంది. కాగా,పుత్తడి బొమ్మలా క‌నిపించే కాజ‌ల్ వెనుక ఇంతటి విశాడగాథ ఉంద‌ని తెలిసి.. అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు