Home సినిమాలు వరుణ్ కోసం చరణ్ భారీ స్కెచ్ వేశాడా..?

వరుణ్ కోసం చరణ్ భారీ స్కెచ్ వేశాడా..?

ఓ సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ఫోన్ చేశాడని తెలుస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఓ కథ విషయంపై మాట్లాడిన రామ్ చరణ్.. వరుణ్ తేజ్ ను ఆ సినిమా చేయమని చెప్పడంతో వరుణ్ తేజ్ కూడా దానికి ఒకే చెప్పారట. తాను చేయాలనుకునే ఓ మంచి సినిమాను వరుణ్‌కి అప్పగిస్తూ తమ్ముడికి చరణ్ కొన్ని సలహాలిచ్చారని తెలుస్తోంది.

కాగా..తెలుగు చిత్రసీమలోని ఓ బడా నిర్మాత రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసి కథ కూడా సిద్ధం చేశారట. ఆ కథను రామ్ చరణ్, చిరంజీవిలకు వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. అయితే అనుకోకుండా ప్రస్తుతం చరణ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఆలస్యం కావడంతో ఆ కథను వరణ్ తేజ్ చేస్తే బావుంటుందని భావించిన రామ్ చరణ్ తమ్ముడు వరుణ్‌కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని సమాచారం. చిరంజీవి మెచ్చిన కథ కాబట్టి దీనిపై వరుణ్ కూడా ఆ నిర్మాతకు ఓకే చెప్పారని తెలుస్తోంది.అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కాగా..ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ హీరోగా నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్న  ‘గని’ చిత్రంలో నటిస్తున్నాడు. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరణ్‌ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్‌ వచ్చింది. బాక్సింగ్‌ రింగ్‌లో పంచులు కొడుతున్న వరుణ్‌ లుక్‌ అభిమానులను ఎంతగానో అలరించింది.  జూలై 30న ‘గని’ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రబృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు