Home ప్రత్యేకం 'వకీల్ ‌సాబ్‌' బిగ్‌ అప్‌డేట్‌: స్టూడెంట్ లీడర్ గా ప‌వ‌న్‌క‌ల్యాణ్..!‌

‘వకీల్ ‌సాబ్‌’ బిగ్‌ అప్‌డేట్‌: స్టూడెంట్ లీడర్ గా ప‌వ‌న్‌క‌ల్యాణ్..!‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘వకీల్ సాబ్’. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్‌ నటించిన పింక్ సినిమాకు రీమేక్‌ ఇది. హిందీలో అమితాబ్ చేసిన  లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. విడుదలకు దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్రబృందం.
అయితే తాజా సమాచారం ప్రకారం వ‌కీల్‌సాబ్ లో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు సంబంధించిన న్యూస్ ఒక‌టి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ప‌వ‌న్ కళ్యాణ్ లా కాలేజీలో స్టూడెంట్ లీడర్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ని సమాచారం. కాలేజీలో అన్యాయం జ‌రిగిన వారికి అండ‌గా నిలిచే వ్య‌క్తిగా పవన్ క‌నిపిస్తాడట‌.. ఇదే క్ర‌మంలో ప్రేమలో పడడం ఆ త‌ర్వాత‌ పెళ్లి చేసుకోవడం ఉంటుందట. అలాగే, ప‌వ‌న్ చేతిలో ప‌ట్టుకున్న హ్యాండ్ వాచ్ ను అత‌ని భార్య గిఫ్ట్ గా ఇస్తుంద‌ని, ఆ సీన్ త‌ర్వాత ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంద‌ని టాక్ న‌డుస్తోంది. అంతేకాదు భార్య‌తో విడిపోవ‌డం, లా ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న ప‌వ‌న్.. ముగ్గురు అమ్మాయిల కోసం మళ్ళీ నల్ల కోటు దరిస్తాడాని టాక్‌ నడుస్తోంది.
ఇదిలాఉంటే.. వకీల్ సాబ్ డిజిటల్ రైట్స్ తో పాటు.. శాటిలైట్ రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ ను తీసుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనేసింది. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు